తమిళనాడులో ఆర్మీ కుప్పకూలిన ఘటనలో ఛీప్ ఆఫ్ ఢిపెన్స్ స్టాప్ సీడీఎస్ బిపిన్ రావత్ కన్నుమూశారు. దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధ్రువీకరించింది. బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ తో పాటు మరో 11 మంది మొత్తంగా 13 మంది మరణించారు. తమిళనాడులో నీలగిరి జిల్లా సూలూర్, వెల్లింగ్టన్ మధ్యలో కొండ ప్రదేశంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రస్తుతం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో చికిత్స పొందుతున్నారు.
ఘటనలో క్షేమంగా బయటపడుతారని అనుకున్న సీడీఎస్ బిపిన్ రావత్ మరణించడం యావత్ దేశాన్ని కలిచి వేసింది. ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ భారత దేశం మొత్తం ఆక్షాంక్షించింది. అయితే దురద్రుష్టవశాత్తు ఆయన తీవ్ర గాయాలతో మరణించారు.
అంతకు ముందు బిపిన్ రావత్ ను తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలించే విజువల్స్ వస్తే ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలతో బయట పడుతారని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా దేశ తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మరణించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది.