కాంగ్రెస్ అమర్థంగా ఉంది… ఇప్పుడు మాదే అసలు కాంగ్రెస్…

-

కాంగ్రెస్ పార్టీని కాదని విపక్షాలకు సారథ్యం వహించేందుకు త్రుణమూల్  కాంగ్రెస్ పావులు కుదపుతోంది. తాజాగా తన అధికార పత్రిక ’జాగో బంగ్లా‘ లో ఇదే విషయాన్ని బయటపెట్టింది. దేశంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ యుద్దంలో అలసిపోయి గ్రాండ్ ఓల్డ్ పార్టీగా మారిందని తన అధికార పత్రికలో విమర్శించింది త్రుణమూల్ కాంగ్రెస్. ’’కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ జోరును ఆపగలగాలి. అయితే అంతర్గత సంక్షోభం, కక్షలతో ఆ పార్టీ నలిగిపోతోంది. అయితే కాలం ఎవరి కోసం ఎదురుచూడదు. భాజపాను ఎదుర్కొనేందుకు మరొకరు ముందుకు రావాలి. టీఎంసీ ఆ బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఇదే నిజమైన కాంగ్రెస్ పార్టీ అని త్రుణమూల్ కాంగ్రెస్‘‘  తన అధికార పత్రిక జాగో బంగ్లా సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. 

ఇటీవల కాలంలో విపక్షాలకు నాయకత్వం వహించాలని త్రుణమూల్ కాంగ్రెస్ ఉవ్విల్లూరుతోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలను సమీకరించేందుక ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పలు రాష్ట్రాల పర్యటను చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ను ఉద్దే శిస్తూ.. యూపీఏ ఎక్కడ ఉందంటూ వ్యాఖ్యానించింది. గోవా, మేఘాలయ, త్రిపుర, యూపీ వంటి రాష్ట్రాల్లో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ పోటీ తామే అన్న రీతిలో పోరాడుతోంది. ఇటీవల త్రిపురలో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీపై త్రుణమూల్ కాంగ్రెస్ పోటీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news