స్టేడియాల్లోకి ప్రేక్షకుల అనుమతి

-

ఇండియా, ఇంగ్లాండ్‌ మధ్య త్వరలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీసును వీక్షించేదుకు ప్రేక్షకుల audience కు అనుమతి లభించింది. ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తూ బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి సామర్థ్యం మేరకు అభిమానులను అనుమతిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఇంగ్లాండ్‌లో కరోనా తీవ్రత తగ్గడంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేస్తుంది.

ప్రేక్షకుల/ audience
ప్రేక్షకుల/ audience

ఇందులో భాగంగా జులై 19 నుంచి పూర్తి స్థాయిలో ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. అన్ని వ్యాపారాలు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నామని, బహిరంగ సమావేశాల్లో ప్రజల సంఖ్యపై పరిమితులను ఎత్తేస్తున్నట్లు చెప్పారు. థియేటర్లు, క్రీడా స్టేడియాల్లో అభిమానుల ప్రవేశాలపై కూడా పరిమితులను ఎత్తేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ప్రజలు కూడా వారి ఇష్టం మేరకు మాస్క్‌లు ధరించొచ్చని తెలిపారు.

ఇండియా, ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీసులో భాగంగా ఆగస్టు 4న తొలి టెస్టు మొదలవనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అనంతరం మానసిక ప్రశాంతత కోసం భారత ఆటగాళ్ళకు బీసీసీఐ విరామం కల్పించిన విషయం తెల్సిందే. జులై 14న జట్టు సభ్యులు దుర్హమ్‌లో కలవనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news