బ‌ర్త్ డే స్పెష‌ల్ : విజ‌న్ ఉంది..విజ‌యాలూ ఉన్నాయి..ద‌టీజ్ బాబు

-

సామాన్యుడికి స్ఫూర్తి సీబీఎన్ .. అవును.. ఈ మాట ఓ వంద‌సార్లు రాయొచ్చు ఏం కాదు. ఆయ‌న తండ్రి సీఎం కాదు ఓ మామూలు రైతు. ఏమీ లేని కుటుంబం నుంచి అన్నీ ఉన్న స్థాయి కి చేరుకున్నారు. ఆ మాట‌కు వ‌స్తే లోకేశ్ కు ఇవాళ పూల దారి. కానీ ఆ రోజు ఆయ‌న స్థితి ఇందుకు భిన్నం. అంచెలంచెలుగా ఎదిగిన నాయ‌కుడి ద‌గ్గ‌ర ఎంద‌రో నాయ‌కులు అయ్యారు.

త‌న దైన శైలిలో రాణించిన ఆయ‌నకు ద‌గ్గ‌ర‌గా కొంద‌రు దూరంగా కొంద‌రు ఇవాళ ఉన్నారు. ఉమ్మ‌డి ఆంధ్రాలో ఉన్నంత పేరు ఆయ‌న‌కు అవ‌శేషాంధ్ర‌లో రాలేదు.. అదొక్క‌టే ఆయ‌నకు అసంతృప్తి ఉంటే ఉండ‌వ‌చ్చు గాక.. మిగిలిన విషయాల్లో ఆయ‌న్ను చూసి లోకేశ్ నేర్చుకోవాలి అదేవిధంగా ఆయ‌న్ను చూసి కొత్త త‌రం కుర్ర‌త‌రం ఎన్నో నేర్చుకోవాలి. ముఖ్యంగా అన్న‌గారు స‌మ‌య పాల‌న‌కు ఎంత ప్రాముఖ్యంగా ఇస్తారో అలానే ఈ అల్లుడు గారు కూడా ! ఒకే కుటుంబం .. మామా అల్లుళ్లు.. పాల‌న పరంగా ఎవ‌రి శైలి వారిదే ! ఈ క్ర‌మంలో 44 ఏళ్లుగా పార్టీ బాధ్య‌తలు మోస్తూ, పార్టీ అభ్యున్న‌తే ధ్యేయంగా ఇవాళ వ‌య‌సు అవ‌రోధాల‌ను అధిగ‌మించి ప్ర‌యాణిస్తున్న చంద్రబాబు మ‌రిన్ని విజ‌య శిఖ‌రాలు అధిరోహించాలి. మ‌రిన్ని కీర్తి శిఖ‌రాలు అందుకోవాలి.

ఉమ్మ‌డి ఆంధ్రాకు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. తొమ్మిదేళ్లు తిరుగులేని నేత‌గా పేరొందారు. ఓ విధంగా ఆ స‌మ‌యంలో ఆయ‌న మాటకు ఎదురు లేదు. తిరుగు కూడా లేదు. చాలా మంది నాయ‌కులు ఆయ‌న ద‌గ్గ‌ర ఓన‌మాలు దిద్దారు. ఆయ‌న నుంచి ఎన్నో నేర్చుకున్నారు.ఆ విధంగా ఇవాళ పుట్టిన్రోజు.. పండ‌గ రోజు చేసుకుంటున్న చంద్ర‌బాబు నాయుడు ఎంద‌రికో స్ఫూర్తి.

ఓ విధంగా పార్టీ ఎదుగుద‌ల ఏడు ప‌దుల వ‌య‌స్సులోనూ అహ‌ర‌హం శ్ర‌మిస్తున్న ఆయ‌నకు ఇప్పుడు కొంత ఇబ్బందిక‌ర ప‌రిణామాలు ఎదుర‌వుతూ ఉన్నాయి. అవి ఆయ‌న ఎదుగుద‌ల‌కు ప్ర‌శ్న‌లుగా నిలుస్తున్నాయి. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు త‌న‌దైన వ్యూహంతో రాణించాలి.. అదేవిధంగా పార్టీలో యువ ఉత్తేజం ఉంది. వాడుకోవాలి. ఈ పుట్టిన్రోజు ఆయ‌న‌కు ఆనందాలు ఇవ్వాల‌ని కోరుకుంటూ..మ‌న లోకం న్యూస్ మీడియా త‌ర‌ఫున జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు స‌ర్.

రాజ‌కీయాల్లో ఎన్నో చూశారు. అవ‌మానాలు ప‌డ్డారు. ప‌డుతున్నారు కూడా ! అయితే ఆయ‌న లో ఉన్న గొప్ప ల‌క్ష‌ణం ప్ర‌తిభ ఉంటే ప్రోత్స‌హిస్తారు. పిలిచి అభినందించి వెళ్తారు. చిన్న వ‌య‌స్సులోనే ఆయ‌న ఇటుగా వ‌చ్చారు. ఎంఏ ఎక‌న‌మిక్స్ చ‌దువుకున్నారు. ఓ సాధార‌ణ కుటుంబం నుంచి ఎదిగివ‌చ్చారు. చిత్తూరు జిల్లా నుంచి ఎదిగివ‌చ్చారు. స‌మ‌య పాల‌న‌కు ఎంతో ప్రాముఖ్యం ఇస్తారు. ఇవాళ్టి నేత‌లు ఆయ‌న‌ను చూసి ఇదొక్క‌టీ నేర్చుకున్నా చాలు. ముఖ్యంగా మారుతున్న సాంకేతిక గ‌తుల‌కు సంబంధిత ప‌రిణామాల‌కు అనుగుణంగా ఆయ‌న అప్ గ్రేడ్ అవుతారు. అంతేకాదు విజ‌న్ కు తిరుగులేద‌ని నిరూపించారు కూడా !

ఇవాళ హైద్రాబాద్ అనే ఓ పెద్ద న‌గ‌రం ఐటీ హ‌బ్ గా మారిందంటే అందుకు కార‌ణం ఆయ‌నే ! అధికారంలో ఉన్నా లేక‌పోయినా ఆయ‌న శ్ర‌మిస్తారు. ముఖ్యంగా పార్టీ ప‌దవులు అందుకుని నిర్ల‌క్ష్యంగా ఉండేవారు క‌న్నా బాధ్య‌తాయుతంగా ప‌నిచేసిన వారంటేనే త‌న‌కు ఇష్టం అని అంటారు. ప‌నిచేసే వాళ్ల‌కే ముందున్న కాలంలో మంచి జ‌రుగుతుంద‌ని ప‌దే ప‌దే చెప్పి కార్య‌క‌ర్త‌ల్లో స్ఫూర్తి నింపుతారు. రాజ‌కీయంగా ఆయ‌న ఇవాళ స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నా కూడా నిలిచి గెలుస్తున్నారు. కొంద‌రు ఆయ‌న స్థాయిని త‌గ్గించి మాట్లాడ‌తారు. ఆయ‌న స్థాయి ఎప్ప‌టికీ త‌గ్గ‌దు. డియ‌ర్ స‌ర్ ఆల్ ద బెస్ట్.

Read more RELATED
Recommended to you

Latest news