కళ్యాణ్ రామ్ పై జూ. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..!

-

నేడు టాలీవుడ్ హీరో, నిర్మాత కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఫొటోలను షేర్ చేస్తూ ట్రెండ్ అయ్యేలా బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. 1978 జూలై 5వ తేదీన జన్మించిన ఆయన నేటితో 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ యేట అడుగుపెడుతున్నారు. ఇక ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎమోషనల్ గా తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. కళ్యాణ్  రామ్ తనకు అన్నకంటే ఎక్కువని అన్నారు. “నాకు అన్నయ్యగా మాత్రమే కాదు. అంత కంటే ఎక్కవ. నాకు స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్త కూడా.

నువ్వు నిజంగా అందరికన్నా బెస్ట్. హ్యాపీ బర్త్ డే కల్యాణ్ అన్నా” అని ట్వీట్ చేశారు. హీరోగా చేస్తూనే నిర్మాతగా రాణించాలనే తపనతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సక్సెస్ అయ్యారు కళ్యాణ్ రామ్. ఈ బ్యానర్ లోనే ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమా రూపొందించి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న చిత్రంలోనూ భాగమయ్యాడు. ప్రస్తుతం మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ చిత్రంలో కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నాడు. అతని పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news