అసెంబ్లీ ఎన్నికల్లో అందుకే ఓడిపోయాం : కేటీఆర్

-

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర రాజకీయాలు మరో దశాబ్దం పాటు కేసిఆర్ చుట్టూనే తిరుగుతాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ’20 ఏళ్లుగా కేసిఆర్ చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు నడిచాయి. మా ప్రభుత్వంలో తెలంగాణను నం.1గా నిలబెట్టాం అని అన్నారు. అధికారంలో కొన్ని పొరపాట్లు చేశాం. సరిదిద్దుకుంటాం అని తెలిపారు. రైతుబంధు, దళితబంధు, కార్యకర్తల విషయంలో పొరపాట్లు గుర్తించలేకపోయాం అని అన్నారు.స్వల్ప తేడాతోనే ఓడిపోయాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విజయం సాధిస్తాం’ అని కేటీఆర్ వెల్లడించారు.

 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని …లై డిటెక్టర్, నార్కో టెస్కైనా సిద్ధమన్నారు కేటీఆర్. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేటీఆర్ దుయ్యబట్టారు. ‘భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని సీఎం రేవంత్ చెప్పగలరా? ప్రతిపక్షాల ఫోన్లను కేంద్రం ట్యాప్ చేస్తోంది. కిషన్ రెడ్డి, రేవంత్ లకు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకునే ధైర్యం ఉందా’ అని కేటీఆర్ సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news