లోక్ సభలో కేంద్ర మంత్రికి చేదు అనుభవం..!

-

18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్. సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. లోక్సభాపక్ష నేతగా ప్రధాని మోడీ తొలుత ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే ఎన్డీయే కూటమి సభ్యులంతా మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రొటెం స్పీకర్ లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేయిస్తున్నారు.

తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే..  లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కేంద్రమంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ప్రధానంగా   కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేసొచ్చే వరకూ విపక్ష సభ్యులు ‘నీట్.. నీట్’ అని అరిచారు. ప్రస్తుతం దేశంలో నీట్ పరీక్ష గురించి ఎంతటి సంచనంగా మారిందో అందరికీ తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news