దుబ్బాక గెలుపు పై బీజేపీ ధీమా వెనుక కారణం ఇదే…!

-

దుబ్బాక ఉప ఎన్నికలో గెలుస్తామనే ధీమా బీజేపీ లో ఎందుకు వ్యక్తం అవుతోంది… ఆ పార్టీ ఈక్వేషన్స్ ఏంటి… ఆ పార్టీ నేతలు అంతలా నమ్మకం ఎందుకు పెట్టుకున్నారు. అంటే ఆసక్తికరమైన విషయాలు బీజేపీ శ్రేణులనుంచి వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయి నుండి వస్తున్న సమాచారం ప్రకారం తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు… ప్రభుత్వం పై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని , రఘునందన్ రావు కి అవకాశం ఇవ్వాలి ప్రశ్నించే గొంతుక అని ప్రజలు భావించారని బీజేపీ నేతలు అంటున్నారు…

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలు బాగా కష్ట పడ్డారు రోజుల తరబడి ఉన్నారు… పార్టీ నుండి ఎమ్మెల్యే, ఎంపిలుగా పోటీ చేసిన అభ్యర్థులను కూడా అక్కడ ఇంచార్జి లుగా పెట్టి ఒక్కొక్కరికి రెండు మూడు గ్రామాలు అప్పగించింది పార్టీ.. సంస్థాగతంగా పెట్టిన దృష్టి పార్టీ కి మంచి వాతావరణం తీసుకురావడం లో సఫలీకృతం అయ్యమని బీజేపీ నేతలు అంటున్నారు… కార్యకర్తలు~ కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటా ఉందని విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లో సక్సెస్ అయ్యామని బీజేపీ నేతలు భావిస్తున్నారు…

కేసీఆర్ నియంత పాలనను అంత మొందించాలని ప్రజలు బావించారని పోలింగ్ రోజు ప్రజల్లో ఉత్సాహం కనిపించిందని.. పోలింగ్ పర్సెంట్ పెరగడం తమకు అనుకూలం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు.. పార్టీ కార్యకర్తలు ఇచ్చిన సమాచారం ప్రకారం దుబ్బాక అసెంబ్లీ పరిధిలో కి వచ్చే 7 మండలాల్లో తమకు మూడు మండలాల్లో స్పష్టమైన లీడ్ వస్తుందని బీజేపీ నేతలు లెక్క చెబుతున్నారు…చేగుంట, దుబ్బాక, నార్సింగ్ మండలాలలో తమకు ఆధిక్యం వస్తుందని అంటున్నారు..కనీసం 5 నుంచి 10 వేల మెజార్టీతో గెలుస్తామని లెక్కలు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news