ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ లో పనిచేస్తూ మంచి ఆదరణ ఉన్న నాయకుడు. ఎప్పుడు అధికార వైసిపి పార్టీపై అలాగే తెలుగుదేశం పార్టీపై ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఉంటారు బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి.
అయితే తాజాగా… విష్ణువర్ధన్ రెడ్డి ఓ వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ జెండాను అవమానించి ఈ వివాదానికి తెర లేపారు విష్ణువర్ధన్ రెడ్డి. పంద్రాగస్టు వేడుకలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగరవేయాలని రెండు ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జెండా పంపిణీ కార్యక్రమాన్ని విష్ణువర్ధన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను రివర్స్ లో పట్టుకొని… వివాదానికి తెర లేపారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Probably this is the first time,
BJP leaders trying to hold #Tiranga 🇮🇳👇 pic.twitter.com/Z4otMUZ3pu— YSR (@ysathishreddy) August 10, 2022