రామ్ చరణ్‌కు ఆ విషయం చెప్పడానికి సంకోచించిన సుకుమార్.. తర్వాత ఏమైందంటే?

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR ఫిల్మ్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన ప్రస్తుతం ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 పిక్చర్ చేస్తున్నారు. రామ్ చరణ్ ..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘రంగస్థలం’ పిక్చర్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా సమంత నటించగా, బ్యూటిఫుల్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ పిక్చర్ కు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో 1980ల్లో ‘రంగస్థలం’ అనే గ్రామంలో జరిగినట్లు ఓ కథను వెండితెరపైన కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు సుకుమార్. ఇక ఇందులో చెవిటివాడిగా రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. సహజ నటుడిగా రామ్ చరణ్ చక్కటి అభినయం కనబర్చారు.

ఆది పినిశెట్టి-రామ్ చరణ్ అన్నదమ్ముల్లుగా చక్కగా నటించారు. కాగా, ఈ చిత్ర షూటింగ్ టైమ్ లో తాను ఒక విషయం రామ్ చరణ్ కు చెప్పడానికి సంకోచించానని, చాలా ఇబ్బంది పడ్డానని, భయపడ్డానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

‘రంగస్థలం’ సినిమా షూటింగ్ టైమ్ లో స్టోరిలో భాగంగా రామ్ చరణ్ పాత్ర ‘చిట్టిబాబు’ ప్రకాశ్ రాజ్ కు సేవలు చేస్తుండాలి. ఆ క్రమంలో ప్రకాశ్ రాజ్ యూరిన్ బ్యాగ్ తీసే విషయం రామ్ చరణ్ కు చెప్పడానికి తాను చాలా ఇబ్బందిపడ్డానని సుకుమార్ చెప్పారు.

Ram Charan Rangasthal Creates Sensation in Kannada

రామ్ చరణ్ కు ఎలాగోలాగా చివరకు యూరిన్ బ్యాగ్ తీయాలని తాను చెప్పానని, అప్పుడు రామ్ చరణ్ ఏమీ ఇబ్బంది పడకుండా ఆ సీన్ చేశాడని తెలిపారు. అది రామ్ చరణ్ గ్రేట్ నెస్ అని మెచ్చుకున్నాడు సుకుమార్. ఓ విలేజ్ లో ఉండే చెవిటివాడిగా రామ్ చరణ్ అభినయం చూసి జనాలు ఫిదా అయిపోయారు.ఇక ఈ సినిమా సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ -సుకుమార్ ల కాంబో మరో పిక్చర్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఉంటుందని ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news