దుబ్బాకలో దూసుకేళ్తున్న బీజేపీ..భారీ అధిక్యంలో రఘునందన్‌ రావు..!

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అధిక్యత కొనసాగిస్తంది..మూడోరౌండ్ల ఫలితాలు వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు 1135 ఓట్ల ఆధిక్యంతోకి వచ్చాడు..తొలి రెండు రౌండ్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి వెనుకబడిపోయారు. మొదటి రౌండ్‌, రెండో రౌండ్‌లోనూ బీజేపీనే ఆధిక్యంలో ఉంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దగ్గరుండి మరీ ఈ ఫలితాలను వీక్షిస్తున్నారు.. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి 279 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి మొత్తం 1135 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు..మూడో రౌండ్‌లోనూ బీజేపీ తన హహ కొనసాగింస్తుంది.
మొదట పోస్టల్ ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థే లీడ్‌లో ఉండగా.. ఇక అన్ని రౌండ్లలోనూ కారు జోరు కొనసాగుతుందని అనుకున్నారు.. కానీ రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి సీన్ మొత్తం మారిపోయింది. రెండో రౌండ్‌లో కూడా బీజేపీ అభ్యర్థే ముందంజలో ఉండటంతో కౌంటింగ్ కేంద్రం బయట బీజేపీ కార్యకర్తలు, నేతలు ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు..ఇప్పటి వరకూ 14,వేల573 ఓట్లను లెక్కించారు.