పోస్టల్ డిపార్ట్ మెంట్ గుడ్ న్యూస్.. పెన్షనర్లకు కొత్త సర్వీసులు

-

పోస్టల్ డిపార్ట్ మెంట్ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన వారు ప్రతి ఏడాది ఈజీగా పెన్షన్ పొందవచ్చు. ప్రతి ఏడాది ఖచ్ఛితంగా పెన్షన్ పొందే బ్యాంకుకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది. సాధారణంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను నవంబర్ నెలలో అందించేవారు. కానీ ఈ సారి కరోనా కారణంగా డిసెంబరు వరకు జీవన్ ప్రమాణ్ పత్రాన్ని అందించవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

money
money

పెన్షన్ దారులకు పోస్టల్ డిపార్ట్ మెంట్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. పెన్షన్ తీసుకునే వారు ఇంటి వద్ద నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందొచ్చు. దీనికి చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని పొందటానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరగాల్సిన అవసరం ఉండదు. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ పెన్షనర్ల కోసం ఇంటి వద్దకే లైఫ్ సర్టిఫికెట్ ను పొందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ సర్టిఫికెట్ కోసం రూ.70 చెల్లించాలని పోస్టల్ బ్యాంక్ వెల్లడించింది.

వృద్ధులు, వికలాంగులకు ఈ సదుపాయం కల్పించింది. రూ.70 చెల్లించినట్లయితే పోస్టల్ శాఖ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికెట్ ను అందిస్తుంది. కేవలం ఐదు నిమిషాల్లోనే బయోమెట్రిక్ లైఫ్ సర్టిఫికెట్ ను జారీ చేస్తారు. సులభంగా మీరు పెన్షన్ పొందవచ్చు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు పదివీ విరమణ పొందినట్లయితే ఈ సర్వీసులు పొందవచ్చు. రూ.70 చెల్లించినట్లయితే పోస్ట్ మెన్ కేవలం 5 నిమిషాల్లోనే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను జారీ చేస్తాడు. మీ ఆధార్ లింక్ ఉన్న రిజిస్టర్డ్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దీనితో పాటు పీపీఓ నంబర్ కూడా అవసరం. ఇలా చేస్తే ఇంటి వద్దకే పెన్షన్ తీసుకోవచ్చు. ఈ సర్వీసులను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news