దేశంలో తమకు తిరుగులేదని భావించిన భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన ఆ పార్టీ తాజాగా జార్ఖండ్ లో కూడా అధికారం చేజార్చుకుంది. ముఖ్యమంత్రి కూడా ఓడిపోయారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తమకు తిరుగులేదని భావించిన ఆ పార్టీకి జార్ఖండ్ ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు.
జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైంది. ఇంతకు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఎవరి చేతిలో ఓడిపోయారా అంటారా…? స్వతంత్ర అభ్యర్ధి చేతిలో. జంషెడ్‌పూర్ ఈస్ట్ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సరయూ రాయ్.. 8550 ఓట్ల తేడాతో రఘుబర్ దాస్ ని చిత్తుగా ఓడించారు. 2014లో రాయ్ జంషెడ్‌పూర్ వెస్ట్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన,
రాయ్ కి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీనితో ఆయన రఘుబర్ దాస్ పైనే పోటీకి దిగారు. జంషెడ్‌పూర్ ఈస్ట్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన ఆయన ఏకంగా ముఖ్యమంత్రినే ఓడించారు. 2014 ఎన్నికల్లో సరయూ రాయ్.. 10 వేల ఓట్ల తేడాతో బన్నా గుప్తాపై విజయం సాధించారు. ముఖ్యమంత్రి ఒక స్వతంత్ర అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. బీహార్ లో దాణా కుంబకోణం నుంచి ఆయన బయటపడ్డారు.