కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్ కు ఓటేసినట్లేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాహుల్ గాంధీది.. కాంగ్రెస్, టీఆర్ఎస్ జోడో యాత్ర అని ఎద్దేవా చేశారు. మోదీ, బీజేపీని ఎదుర్కొనేందుకు గుంపులుగా వస్తున్నారని అన్నారు.
చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించిందంటూ టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. చేనేతపై 5 శాతం జీఎస్టీకి తెలంగాణ ఆర్థిక మంత్రి ఒప్పుకొని సంతకం చేసింది నిజం కాదా? రూ.20లక్షల టర్నోవర్‌పై పన్ను కోరుకున్నది మీరు కాదా? అని నిలదీశారు. నిజంగా చేనేత కార్మికులపై ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 2.5 శాతం పన్ను వదులుకోవచ్చు కదా? అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
ఈ 8 ఏళ్లలో మునుగోడు నియోజకవర్గంలో అదనంగా ఒక్క గుంట భూమికీ నీళ్లు ఇవ్వలేదని లక్ష్మణ్ విమర్శించారు. నియోజకవర్గం అభివృద్ధి కావాలన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ప్రజలు గెలిపించాలని కోరారు.