రివర్స్ ఆపరేషన్: హస్తంపై కమలం ఫోకస్?

-

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు దూకుడుగా రాజకీయం చేస్తున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ టార్గెట్ గా బీజేపీ రాజకీయ యుద్ధం చేస్తుంది..అలాగే జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా నిర్వహించి…టీఆర్ఎస్ పార్టీకి చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చింది. అలాగే పరేడ్ గ్రౌండ్ లో భారీగా సభ నిర్వహించి..కారుకు రెడ్ సిగ్నల్ వేసింది.

 

 

congress-party-bjp-party

అయితే టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ నడుస్తుంటే…మధ్యలో కాంగ్రెస్ సైలెంట్ గా బలపడే కార్యక్రమాలు చేస్తుంది. అనూహ్యంగా కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి..టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలని రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేస్తున్నారు…ఇప్పటికే పలువురు నేతలని హస్తం గూటికి చేర్చారు..ఇంకా మరికొందరు నేతలకు కాంగ్రెస్ కండువా కప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా కాంగ్రెస్ సైలెంట్ గా వలస కార్యక్రమాన్ని చేస్తుంది.

ఇక మొన్నటివరకు జాతీయ కార్యవర్గ సమావేశాల హడావిడిలో ఉన్న బీజేపీ…ఇప్పుడు దూకుడు పెంచింది…ఇంకా మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు ఇచ్చిన సూచనలతో రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బలపడటమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్లనుంది. ఇప్పటికే పార్టీలో పలు కమిటీల నియామకాలు జరిగాయి. అలాగే పార్లమెంట్ స్థానాలని క్లస్టర్లుగా విభజించి…ఒకో క్లస్టర్ బాధ్యతని ఒక్కో కేంద్ర మంత్రికి అప్పగించారు. అంటే పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే విషయంలో స్థానిక బీజేపీ నేతలకు కేంద్ర మంత్రులు దిశా నిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో ఈటల రాజేందర్ కన్వీనర్ గా చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని బీజేపీలోకి తీసుకురానున్నారు.

అయితే ఈటల…టీఆర్ఎస్ నేతలపై ఫోకస్ చేస్తే…అదే కమిటీలో ఉన్న డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి..కాంగ్రెస్ పై ఫోకస్ చేయనున్నారు. టీఆర్ఎస్ నేతలని కాంగ్రెస్ లోకి లాగుతుంటే…కాంగ్రెస్ నేతలని బీజేపీలోకి తీసుకోచ్చేందుకు చూస్తున్నారు. మొత్తం మీద బీజేపీ రివర్స్ ఆపరేషన్ చేసి..కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news