ఇంటర్నేషనల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. ఈరోజు 1 శాతానికి పైగా దిగిరావడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్‌కు 1.08 శాతం క్షీణించింది. ఈ ముడి చమురు ధర ఇప్పుడు బ్యారెల్‌కు 99.57 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ రేటు విషయానికి వస్తే.. దీని ధర బ్యారెల్‌కు 0.98 శాతం తగ్గింది. 97.55 డాలర్ల వద్ద ఉంది. క్రూడాయిల్ ధరలు దిగి రావడం భారత్‌కు సానుకూల అంశమని చెప్పవచ్చు. దీని వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి కాస్త తగ్గుతుందని భావిస్తున్నారు. ముడి చముర ధరలు పెట్రోల్, డీజిల్ రేట్లపై ప్రభావం చూపనున్నాయి. అందువల్ల ఈరోజు ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో జూలై 7న పెట్రోల్, డీజల్ ధరలు నిలకడగానే కొనసాగాయి.
హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు లీటరకు రూ. 109.64 వద్దనే ఉండగా.. డీజిల్ రేటు అయితే లీటరుకు రూ. 97.8 వద్ద కొనసాగుతోంది. చాలా రోజుల నుంచి రేట్లలో మార్పు లేక స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి. వరంగల్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు వరుసగా రూ. 109.41, రూ. 97.33 వద్ద కొనసాగుతోంది. వైజాగ్‌లో పెట్రోల్ కొనాలంటే లీటరుకు రూ. 110.46 చెల్లించుకోవాలి. డీజిల్ కోసం రూ. 98.25 ఇవ్వాల్సి ఉంటుంది. కర్నూల్‌లో పెట్రోల్ రేటు రూ. 112.1గా, డీజిల్ రేటు రూ. 99.83గా ఉంది. గుంటూరులో పెట్రోల్ ధర రూ. 111.74 వద్ద ఉంది. డీజిల్ ధర రూ. 99.49 వద్ద ఉంది.