తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు వైయస్ షర్మిల విషయంలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. తెలంగాణ లో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయడం ద్వారా బలపడాలని భారతీయ జనతా పార్టీ నేతలు భావించారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎక్కువగా టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. షర్మిల వస్తు వస్తు సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయడంతో బీజేపీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేశారు. రాజకీయంగా తెలంగాణ లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఎన్ని రోజులు కూడా సీఎం కేసీఆర్ ను విమర్శించే విషయంలో బీజేపీ నేతలు ముందు ఉంటారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా షర్మిల ముందుకు రావడంతో ఇప్పుడు బీజేపీ కూడా ఇబ్బంది పడుతోంది. ప్రతిపక్షాలకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత వెళుతుంది అనే దానిపైన వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ తరుణంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిల తనవైపుకు తిప్పుకునే అవకాశం ఉంటే మాత్రం కచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతాపార్టీ ఇబ్బంది పడే అవకాశాలు ఉండవచ్చు.