తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో.. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికివారు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 20 నుండి తెలంగాణలో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. 119 నియోజక వర్గాలకు 119 మంది కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. వారంరోజులు తెలంగాణలో ఎమ్మెల్యేల టూర్ ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో నియోజక వర్గంలో వారం పాటు బస చేయనున్నట్లు తెలుస్తో్ంది. పార్టీ పరిస్థితి, స్థానిక పరిస్థితులపై ఈ ఎమ్మెల్యేలు అధిష్టానానికి రిపోర్ట్ ఇవ్వనున్నట్ల తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతా ల్లోనూ మరింత బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు ప్రణాళికా ప్రకారం ముందుకు వెళ్లాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలోగ్రామీణ నియోజకవర్గాల్లో బలమైన నేతలను సమ కూర్చుకోవడమే లక్ష్యంగా కాషాయదళం కొత్తప్రణాళికను అమలు చేస్తోంది. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలోని జీహెచ్ఎంసీతోపాటు వరంగల్, నిజామా బాద్, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లా కేంద్రాల్లోనే కొంతమేర పట్టుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానానికి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.