ప్రారంభమైన ప్రజాసంగ్రామ ముగింపు యాత్ర..

బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించిన ప్రజాసంగ్రామ యాత్ర హుస్నాబాద్ వేదికగా ముగియనుంది. ముగింపు వేడుకలకు ముఖ్య అథితిగా కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ హాజరయ్యారు వీరితో పాటు రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్, ఇతర బీజేపీ నేతలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, వినోద్ పాల్గొన్నారు. హైదరాబాద్ భాగ్యలక్ష్మీ ఆలయంలో మొదలైన పాదయాత్ర దాదాపు 19 నియోజకవర్గాల గుండా 36 రోొజులు 438 కిలోమీటర్ల సాగింది. తొలివిడత యాత్ర సక్సెస్ కావడంతో భారీ ఎత్తున ముగింపు వేడుక నిర్వహించాలని బీజేపీ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ముందుగా సభావేదికను హుజూరాబాద్లో నిర్వహించాలని భావించారు. అయితే ఎన్నికల కోడ్ తో సభాస్థలి హుస్నాబాద్కు మారింది. హుజూరాబాద్ లో నిర్వహిస్తే బైపోల్ కు కూడా ఎంతోకొంత ప్లస్ అవుతుందని బీజేపీ భావించింది.

bandi-sanjay

కాగా ప్రస్తుతం కోడ్ అమలులో ఉండటంతో పక్క నియోజకవర్గం హుస్నాబాద్ లో యాత్ర ముగింపు సభను నిర్వహిస్తున్నారు.