RRR టీజర్‌పై బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..రిలీజ్‌ చేస్తే బరిసెలతో కొడతామని..!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై రోజు రోజుకు వివాదం ముదురుతోంది..ఈ సినిమా టీజర్ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది..గతంలో విడుదల చేసిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ హిందూ మతాన్ని కించపర్చేలా ఉందంటూ తెలంగాణ బీజేపీ మండిపడుతోంది..సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లు తగలబడతాయ్‌ అంటూ డైరెక్టర్ రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్..ట్రిపుల్ ఆర్‌ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తున్నారు. అందులో ఓ సన్నివేశంలో ఆయన టోపీ ధరించడం కాంట్రవర్సీకి తెరలేపింది.. హిందూ మతాన్ని కించపరిచేలా ఎన్టీఆర్ లుక్ ఉందని మండిపడుతున్నారు కమలనాథులు.
కొమురం భీంను అవమానపర్చేవిధంగా సినిమాలో సన్నివేశాలున్నాయంటూ కమలనాథులు కన్నెర్రజేశారు..కొమరం భీమ్‌ సినిమా రిలీజ్‌ చేస్తే బరిసెలతో కొడతామని హెచ్చరించారు సంజయ్. రిలీజ్ అయ్యే ప్రతి థియేటర్‌ను తగలబెడతామన్నారు. కొమురం భీమ్‌ను కించపరిచేలా సినిమా తీస్తున్నారని..రాజమౌళికి తగిన గుణపాఠం చెప్తామన్నారు బండి సంజయ్‌..భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్..విడుదలకు ముందే వివాదాస్పదంగా మారడంతో హైప్ క్రియేట్ అవుతోంది.