ప్రేమోన్మాదానికి మరో యువతి బలి..విశాఖలో గొంతుకోసి దారుణంగా..!

-

ఏపీలో ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది..విశాఖలో గొంతుకోసి హత్యచేశాడు యువకుడు.. నిందితుడుని పోలీసుల అదుపులోకి తీసుకోగా..మరో యువకుడు పరారీలో ఉన్నాడు..మొన్న బెజవాడలో దివ్య తేజస్విని..నిన్న విశాఖలో వరలక్ష్మి.ఇలా ప్రేమోన్మాదుల కాటుకు అమాయక యువతులు బలైపోతున్నారు..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఉన్మాదుల దాడులు మాత్రం ఆగడం లేదు..మొన్న బెజవాడ దివ్య తేజస్విని ఘటన మరువక ముందే..నిన్న విశాఖ గాజువాకలో యువతి గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడో యువకుడు.వివరాలల్లోకి వెలితే..విశాఖ శ్రీనగర్‌ సుందరయ్యకాలనీకి చెందిన యువతి ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. అదే ప్రాంతానికి చెందిన అఖిల్‌సాయితో పరిచయం ఏర్పడింది..తన స్నేహితుడు రామ్‌తో కలిసి యువతిని సాయిబాబా గుడివద్దకు పిలిపించాడు అఖిల్‌. ప్రేమ వ్యహారంలో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. దీంతో రెచ్చిపోయిన అఖిల్‌..కత్తితో యువతి గొంతుకోశాడు. యువతి తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వచ్చేసింది. గమనించిన కుటుంబసభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. ఇంటి నుంచి వెళ్లిన కూతురు తీవ్ర గాయాలతో వచ్చి చనిపోవడంతో కన్నవాళ్లు కుమిలిపోతున్నారు..నిండితుడు అఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని స్నేహితుడు రామ్‌ పరారీలో ఉన్నాడు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

Read more RELATED
Recommended to you

Latest news