కొడుకుని జైలుకు పంపిన తల్లి వాట్సాప్ స్టేటస్

టెక్నాలజీ పెరిగాక ఎటువంటి నేరాలు చేసినా వెంటనే దొరికేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తల్లి వాట్సాప్‌ స్టేటస్‌ కొడుకును జైలు పాలు చేసింది. విషయం ఏంటంటే జూలై 12, 2019న సాయి ​కిరణ్‌ అనే వ్యక్తి గుడికి వెళ్లి తన ఇంటికి వచ్చేసరికి అతని ఇంటి తలుపులు బార్లా తెరచి ఉన్నాయి. అయితే తాళం వేయడం మర్చిపోయానేమో అనుకుని లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి తన ఇంట్లో బంగారం దొంగిలించినట్లు గుర్తించాడు.

తన ఇంట్లో చోరి జరిగినట్లు పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. ఇక ఇన్ని రోజుల తరువాత వారి ఇంటి పక్కన ఉండే మహిళ కిరణ్‌ వాళ్ల ఇంట్లో పోయిన ఓ నగను పెట్టుకొని ఉన్న ఫోటోను వాట్సాప్‌ స్టేటస్ లో షేర్‌ చేసింది. ఇది చూసిన కిరణ్‌ అది తమ ఇంట్లో దొంగిలించినదేనని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె కొడుకు జితేందర్‌ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. కొడుకుని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ విషయం అతని తల్లి తెలిసే జరిగిందని పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.