దేవాలయాల పరిరక్షణకు బీజేపీ రథ యాత్ర !

-

దేవాలయాల పరిరక్షణకు రథ యాత్ర చేసే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు చెబుతున్నారు. రామతీర్ధం నుంచి  రామ రథ యాత్ర పేరుతో  చేపట్టేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయని అంటున్నారు. ఆలయాలు, విగ్రహాల పై దాడులు వంటి అంశాలపై యాత్రలో బిజెపి నేతలు ప్రసంగించనున్నారని అంటున్నారు. బీజేపీ జాతీయ నాయకులను భాగస్వాములు చేస్తూ రథ యాత్ర సిద్దం అవుతున్నట్టు చెబుతున్నారు. ఆయా జిల్లాలలో విగ్రహాలు పై దాడులు జరిగిన ప్రాంతాల్లో యాత్ర ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు బీజేపీ అగ్రశ్రేణి నేతలు.

యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్, పై  చర్చించేందుకు ఈనెల 17 న వైజాగ్ లో బీజేపీ కోర్ కమిటీ భేటీ అవుతోంది. ఇక రాష్ట్రంలో దేవాలయాలపై దాడులపై ప్రభుత్వం  సిట్ ను నియమించిన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ నుంచి జరుగుతోన్న దాడులపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం పనిచేయనుంది. కృష్ణాజిల్లా ఎస్పీ రవీంధ్రనాథ్ బాబు తో పాటు సిట్ లో 16 మంది సభ్యులు ఉన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news