తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యిందని బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్నది. ఈ క్రమంలోనే రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకుండా రైతలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే రైతుల పక్షాన దీక్ష చేయాలని భావిస్తోంది. ఈనెల 20న లేదా నాలుగో వారంలో దీక్షను ప్రారంభించనున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
అదేవిధంగా, ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కో ఆర్దినేట్ చేసే బాధ్యతలను పార్లమెంట్ సీనియర్ మెంబర్, ఎంపీ లక్ష్మణ్‌కు ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. పార్టీ నేతలు అందుబాటులో ఉండాలని, రైతు దీక్షను దిగ్విజయం చేయాలని మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.