సమాజంలో నేటికాలంలో భార్యభర్తల బంధాలు కేవలం అవసరాలు తీర్చే యంత్రాలుగా మారాయి.. నలుగురిలో మాత్రం ఆలుమగలు కానీ నాలుగు గోడల మధ్య బద్ధ శత్రువుల్లా ఉంటున్నారు.. ఇలా అందరని కాదు.. కానీ చాలా కుటుంబాల్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ నిజమైన దాంపత్యాన్ని మరచి జీవిస్తున్నారు.. ఇక పెళ్లయిన కొత్తలో భార్యభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంతా కేరింగ్ తీసుకుంటారు. ఇష్ఠాయిష్టాలు తెలుసుకుని భాగస్వామి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు.
కొంత కాలానికి ఆ ప్రేమలకు మసిపట్టిపోయి మసగ్గా కనిపిస్తాయి.. అందుకు నిదర్శనం ఈ మొగుడు.. కట్టుకున్న భార్యనే బ్లాక్ మెయిల్ చేసి ఏకంగా కోటి రూపాయలు నొక్కేశాడు.. గచ్చిబౌలిలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు తెలుసుకుంటే.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భార్యకు ఆమె భర్త మిత్రుడి పేరుతో మెసేజ్‌లు, అశ్లీల ఫొటోలు పంపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. తాను కోరినన్ని డబ్బులు ఇవ్వకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి సుమారుగా రూ.కోటి వరకు వసూలు చేశాడట.. కాగా భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఇతని భార్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి దర్యాప్తులో సంతోష్ దారుణాలు వెలుగులోకి వచ్చాయట..
ఒక ఇతని భార్యనే కాదు గతంలో కూడా కొంతమంది మహిళలను సంతోష్ వేధించినట్టు సమాచారం అని తెలిపిన సైబరాబాద్ మహిళా పోలీసులు సంతోష్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారట.. చెడు వ్యసనాలకు బానిసగా మారిన ఇతను ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాడని ఈ క్రమంలో చివరికి కట్టుకున్న భార్యను కూడా మోసం చేసి దొరికిపోయాడని మాదాపూర్ ఏసీపీ శ్యామ్ తెలిపారు..