టీడీపీలో చిన్నబాబుగా పిలుచుకునే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. మౌనం పాటిస్తున్నా రు. శాసన మండలిలో వైసీపీ, టీడీపీ నేతలు కొట్టుకున్నారనే వార్తల నేపథ్యంలో ఈ ఘర్షణకు ప్రాధాన కారణం చిన్నబాబేనని వైసీపీ మంత్రులు, నాయకులు ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన మౌనం పాటించడంపై టీడీపీలోనే పెద్ద చర్చ సాగుతోంది. ద్రవ్య వినిమయ బిల్లు సహా ఏపీ సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులను వైసీపీ మంత్రి బొత్స సత్య నారాయణ, మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డిలు మండలిలో ప్రవేశ పెట్టారు. అయితే, వీటిపై చర్చించేందుకు మండలిలో చోటు చేసుకున్న పరిణామాలు ఉద్రిక్తతలకు దారితీశాయి.
మండలి అయినా.. సభ అయినా.. కొన్ని నియమాలను పాటిస్తాయి. వాటి ప్రకారం ద్రవ్య వినిమయబిల్లు పై చర్చించిన తర్వాత.. దానిని ఆమోదించిన లేదా సవరణలు కోరిన తర్వాత.. మిగిలిన బిల్లులపై చర్చ చేపట్టడం అనేది సంప్రదాయం కాదు. ఏదైనా ఉంటే.. తర్వాత రోజు సభల్లో చర్చించాలి. మండలి విష యానికి వస్తే.. రెండో రోజు ఈ బిల్లులను ప్రవేశ పెట్టారు కాబట్టి.. అదేరోజు ముందుగా ద్రవ్య వినిమయ బి ల్లును ప్రవేశ పెట్టి..చర్చ చేపడితే.. తర్వాత మిగిలిన బిల్లులపై చర్చించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నే వైసీపీ మంత్రులు ముందుగా ఇతర బిల్లులపై చర్చించి.. ద్రవ్య బిల్లుపై తర్వాత చర్చించాలని నిర్ణ యించుకున్నారు.
అయితే, టీడీపీ సభ్యులు ముందుగా ద్రవ్యబిల్లుపై చర్చ చేపట్టాలని. తర్వాత మిగిలిన బిల్లులపై చర్చచే పట్టాలని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ సభ్యులు పోడియంను చుట్టు ముట్టారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యుడు నారాలోకేష్ వీటిని తన ఫోన్‌లో చిత్రీకరించేందుకు ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపిం చారు. ఇది ఘర్షణకు దారితీసింది. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో కత్తులు నూరుకు న్నారు. అయితే, ఈ మొత్తం వ్యవహారానికి కేంద్రంగా ఉన్న లోకేష్ మాత్రం ఈ విషయంపై నోరు మెదపలే దు. నిత్యం మీడియాతో టచ్‌లో ఉండే ఆయన .. నిన్న రోజు రోజంతా కూడా ఆయన బయటకు కూడా రాలేదు.
నిజానికి తప్పు లేకుంటే ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ఉంది. ఇదే విషయంపై టీడీపీలోనూ చర్చ సాగింది. చిన్నబాబు తప్పు ఉందని అధికార పక్షం సవాళ్లు రువ్వింది. మరి తప్పులేనప్పుడు లోకేష్ బయటకు వచ్చి.. ప్రతిసవాల్ చేసి ఉండొచ్చుకదా? అనే ప్రశ్న వారి నుంచి వ్యక్తమైంది. ఇదే విషయంపై వారు చర్చించుకున్నట్టు సమాచారం. దీనిపై మాట్లాడిన చంద్రబాబు కూడా దాడి ఎవరు చేశారనే విషయంపై మాట్లాడకుండా వైసీపీ నేతలపై విమర్శలు చేసేందుకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. సో.. దీనిని బట్టి అసలు ఏం జరుగుతోందనే విషయం స్పష్టమవుతోందని అంటున్నారు అధికార పార్టీ నాయకులు.