న్యూడ్ ఫోటోలు పంపించాలంటూ అమ్మాయికి బ్లాక్‌మెయిల్..!

-

దేశంలో ఎదో ఒక్క ప్రాంతంలో అమ్మాయిలు కామాంధుడి చేతిలో వేధింపులకు, అఘాయిత్యాలకు గురవుతూనే ఉన్నారు. వారి మాయమాటలతో అమ్మాయిలను నమ్మించి మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో ఘటన చోటుచేసుకుంది. తనతో పాటు ల్యాబ్‌లో పనిచేస్తున్న యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకుని.. న్యూడ్ ఫోటోలు పంపాలంటూ వేధిస్తున్న యువకుడిని హైదరాబాద్ షీ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Blackmail
Blackmail

జగద్గిరిగుట్టలోని ప్రైవేట్ ల్యాబ్‌లో ఓ యువతి రెండేళ్లుగా పనిచేస్తోంది. అక్కడే టెక్నీషియన్‌గా పనిచేసే శ్రీనివాస్ అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకుని చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో సెల్‌ఫోన్లో ఫోటోలు తీశాడు. కొద్దిరోజుల తర్వాత ఆమెను వాటితో బెదిరించి వేధింపులకు పాల్పడేవాడు. నగ్నంగా ఫోటోలు తీసి తనకు పంపించకపోతే ఏకాంతంగా తీసుకున్న ఫోటోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. అతడి వేధింపులు తీవ్రం కావడంతో బాధితురాలు షీ టీమ్స్‌ని ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news