కరోనా పరీక్షల కోసం సంజీవని వాహనాలు..!

-

కరోనా కట్టడికి జగన్ ప్రభుత్వం కరోనా పరీక్షల సంఖ్యను పెంచింది. ల్యాబ్‌లకు తోడు కొత్తగా సంజీవని వాహనాలను రంగంలోకి దించింది. ఆర్టీసీ ఇంద్ర బస్సుల్ని సంజీవని వాహనాలుగా మార్చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఈ బస్సులు చేరాయి. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలోని పట్టణ, గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో అనుమానితుల నుంచి నమూనాలను సేకరించేందుకు 5 బస్సులు అందుబాటులోకొచ్చాయి.

ఇక అరగంటలోనే కరోనా టెస్టులు, ఫలితం రానుంది. కరోనా పరీక్షలు చేసేలా బస్సులో సీట్లు  తొలగించి ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. బస్సుకు రెండు వైపుల నుంచి ఒకేసారి పదిమంది నమూనాలు సేకరించవచ్చు  ఫలితాన్ని కేవలం అరగంటలోనే తెలుసుకోవచ్చు స్క్రీనింగ్‌ పరికరాలు, స్వాబ్‌ను అనుసంధానించే పరికరం, వివరాల నమోదుకు వినియోగించే కంప్యూటర్‌, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు.

Read more RELATED
Recommended to you

Latest news