భారత్-చైనా వివాదంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని స్పష్టం చేశారు. నేను భారత ప్రజలను ప్రేమిస్తున్నాను అదేవిధంగా నేను చైనా ప్రజలను కూడా ప్రేమిస్తున్నాను అని తెలిపారు. ట్రంప్ భారతదేశానికి అనుకూలంగా స్పందించిన విషయంపై వైట్ హౌస్ అధికార ప్రతినిధి కేలీ మెకనీ మీడియా ప్రశ్నించగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
టిక్‌టాక్ సహా చైనా రూపొందించిన యాప్స్ ను నిషేధించాలంటూ యూఎస్ కాంగ్రెస్ సభ్యులు లేఖ రాసిన రోజే డొనాల్డ్ ట్రంప్ తరఫున వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి తాజాగా ప్రకటన వెలువడటం ఆసక్తి రేపుతోంది. భారత్‌తో పాటు చైనాను కూడా ప్రేమిస్తున్నామంటూ డొనాల్డ్ ట్రంప్‌ను ఉటంకిస్తూ ప్రెస్ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. యూఎస్ కాంగ్రెస్ సభ్యులు రాసిన లేఖపై ట్రంప్ తన వైఖరి ఏమిటనేది పరోక్షంగా స్పష్టం చేసినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.