పొట్టలో గ్యాస్ పేరుకుపోవడం వల్ల శరీరం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. చాలా మందిలో ఇది కనిపిస్తుంది. ఐతే ఇలాంటప్పుడు తొందరగా ఆ ఉబ్బుని క్లియర్ చేసుకోవాలి. లేదంటే అనేక ఇతర వ్యాధులకి దారి తీసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా లేరు అని చెప్పడానికి ఉబ్బు ఒక కారణం అవుతుంది. దీని నుండి బయటపడడానికి చాలా మార్గాలున్నాయి. వాటిల్లో ఆయుర్వేదంలో చెప్పబడిన అద్భుతమైన వైద్యం కూడా ఉంది. గ్యాస్ కారణంగా ఉబ్బుగా కనిపించడం నుండి బయటపడడానికి ఆయుర్వేదంలోని ఒకానొక మార్గం గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో వైద్యం తయారు చేసుకునే విధానం మీకోసం.
అర టీ స్పూన్ వాముతో పాటు గోరువెచ్చని నీళ్ళు కలిపి భోజనం చేసిన 45నిమిషాల తర్వాత సేవించాలి.
ఒక రోజులో పూర్తిగా పూదీన నీళ్ళు మాత్రమే తాగాలి.
ఏలకులు నీళ్ళలో కలుపుకుని భోజనం చేసిన గంట తర్వాత తాగాలి.
జీలకర్ర, సోపు, ధన్యాల టీ తాగాలి. భోజనం ముందు కానీ తర్వాత కానీ తాగితే మంచిది.
భోజనం చేసిన వెంటనే నీళ్ళు ఎక్కువగా తాగవద్దు. అలాగే పరిమితికి మించి భోజనం చేయవద్దు. హెవీ ఫుడ్ జోలిక్ అస్సలు వెళ్ళవద్దు.
వీటిని అనుచరిస్తే శరీరంలో గ్యాస్ తగ్గి పొట్ట ఉబ్బుగా తయారవ్వదు. ఉబ్బుగా ఉన్న పొట్ట కూడా మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఈ రోజుల్లో ఉబ్బు అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. దాని నుండి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. లేదంటే తీవ్ర ఇబ్బందులకి గురయ్యే ప్రమాదం ఉంది.