తమిళ పాలిటిక్స్ : రజనీ ఔట్.. విజయ్ ఇన్ !

-

రాజకీయాల్లోకి రావాలన్న ప్రయత్నాలకు రజనీకాంత్ ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్టే. ఇవాళా, రేపు అంటూ .. ఇంతకాలం ఊరించిన రజనీ .. ఇక రాజకీయాలు నావల్ల కాదని తేల్చేశారు. ఆరోగ్య కారణాల వల్ల.. ఇప్పట్లో పార్టీ పెట్టలేనని రాజకీయాలతో సంబంధం లేకుండానే ప్రజలకు సేవ చేస్తానని రజనీ తన మూడు పేజీల లెటర్‌లో చెప్పారు. ఇక రజనీ రాజకీయాల చాఫ్టర్‌ ముగిసినట్టే. చాలాకాలంగా.. పాలిటిక్స్‌లోకి రావాలని తలైవా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

తమిళనాట విపరీతమైన ప్రజాదరణ ఉన్న హీరో కావడంతో ఈ అభిమానాన్ని పొలిటికల్‌గా క్యాష్‌ చేసుకోవాలని… రజనీ బృందం ప్రయత్నించింది. కానీ రాజకీయాలకు రజనీ నో చెప్పడంతో  తమిళ్ పొలిటికల్ స్క్రీన్ పై హీరో విజయ్ పేరు వచ్చింది. ఇప్పటికే తమిళనాడు సీఎం పళనీ స్వామిని విజయ్ రహస్యంగా కలిశారు. ఈ నెల 31న పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. జయలలిత సమాధి దగ్గర ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. రజనీ పొలిటికల్ ఎంట్రీ ,అళగిరి పార్టీతో DMK ఓటు బ్యాంక్ చీల్చేలా స్కెచ్ వేస్తున్నట్టు చెబుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news