టీఆర్ఎస్ నేతను కొట్టించిన మేయర్… అందుకేనా ?

బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఒక ఇంటి నిర్మాణం విషయంలో టిఆర్ఎస్ నేతల మధ్య వివాదం చెలరేగింది. దీంతో బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డితో ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులకు మరో వర్గానికి చెందిన యువకుడు ఫిర్యాదు చేశాడు. కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 71, 72, 73 ప్లాట్ నంబర్ 35 పార్ట్, 36 పార్ట్ స్థలంలో తన బంధువు ఇల్లు నిర్మాణం చేసుకుంటే మేయర్ అనుచరులు ఇంటిని జెసిబితో నేలమట్టం చేశారని శివకిశోర్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు.

ఎందుకు ఇల్లు కూలగొడుతున్నరని ప్రశ్నిస్తే నువ్వేవడు రా అని పౌరుష పదజాలంతో దూషించడమే కాక కిశోర్ మీద 7 మంది వ్యక్తుల రాళ్లతో దాడి చేశారని అంటున్నాడు. అయితే దెబ్బలు తిన్న ఈ శివకుమార్ గౌడ్ టిఆర్ఎస్ యువజన విభాగం నాయకుడని అంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్ 10లక్షలు డిమాండ్ చేసాడని.. ఇవ్వకపోవడం తో కక్షతో కూల్చుతున్నారని శివ కుమార్ గౌడ్ ఆరోపణలు చేస్తున్నారు. అంతే కాదు తనకు బుచ్చిరెడ్డి తో ప్రాణహాని ఉందంటూ ఆయన మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.