హైదరాబాద్ శివారులోని IDA బొల్లారం లోని వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమలో భారీ పేలుళ్ళు జరిగాయి. కార్మికులు అందరూ పరిశ్రమ ఆవరణలో నిర్బంధమయ్యారు. అయితే భయంతో కొంతమంది పరుగులు తీసినట్టుగా చెబుతున్నారు. వింధ్యా కెమికల్స్ లో లాక్ డౌన్ తరువాత మూడు షిఫ్ట్ లలో పని కొనసాగుతుంది. 35 మంది చొప్పున ఉదయం ఆరు గంటల నుండి రాత్రి 9 వరకు పని చేస్తున్నారు. కెమికల్ తో ఆ ఇండస్ట్రీ నిండి పోయింది. ఫైర్ సిబ్బంది వింధ్యా కెమికల్స్ పరిశ్రమకు చేరుకొని మంటలను అర్పివేస్తున్నారు. ఒక రియాక్టర్ పేలిపోవడంతో ప్రమాదం జరిగింది.
ఒకదాని మంటలు మరో దానికి అంటుకోవడంతో భారీ శబ్దంతో రెండు రియాక్టర్లు పేలి పోయాయి. పక్కనే ఉన్న మూడు రియాక్టర్ లు దూరంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. 35 మంది డ్యూటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 20 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఐదుగురి ముగ్గురి పరిస్థితివిషమంగాఉందని అంటున్నారు. ఫైర్ సెప్ట్ రిస్క్ టీమ్ సిబ్బంది తో వింధ్యా కెమికల్స్ వద్ద చేరుకున్న అధికారులు. బొల్లారం నుండి మూడు కిలోమీటర్ల వరకు రాక పోకలను నిలిపివేశా. విద్యుత్ సరఫరా కూడా ఆపేసిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.