BOLLYWOOD :’ ఫైటర్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్….

-

వార్, పఠాన్ సినిమాల‌ ఫేమ్ సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సొట్ట బుగ్గల సుందరి దీపిక పదుకొనే ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ఫైటర్. రిపబ్లిక్ డే కానుకగా వచ్చేనెల జనవరి 25వ తేదీన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతుంది. ఇక సినిమా రిలీజ్ కి 30 రోజులే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ చిత్రం నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ తో పాటు టీజర్ కి మంచి స్పందన లభించింది.

 

ఇదిలా ఉండగా…. ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సెకండ్ సింగిల్ ఇష్క్ జైసా కుచ్ (Ishq jaisa Kuch) పాట‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో హృతిక్ మరియు దీపిక మధ్య గల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఈ సాంగ్ లో వీరిద్దరూ హాట్ మోడ్ లో ఉన్నారు. అనిల్ కపూర్, సంజిద షేక్, అక్షయ్ ఒబెరాయ్ తదితర నటులు ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version