‘కర్వా చౌత్’ పండుగ.. బాలీవుడ్ భామల పూజలు..!

-

బాలీవుడ్ లో పండుగ వాతావరణం నెలకొంది. నటీమణులు తమ భర్తలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యం, సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు చేస్తున్నారు. ఉత్తరాదిన ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే ‘కర్వా చౌత్’ పండుగ వాతావరణం కనిపించింది. భర్త శ్రేయస్సు కోసం భార్యలు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి వేళ భర్తను, చంద్రుడిని జల్లెడ జాలిలో చూసి ఉపవాసాన్ని విరమించుకునే పండుగ ఇది.

ఈ పండుగను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించుకోవడంలో నటి శిల్పా శెట్టి ముందుంటారు. ఈ సారి కూడా మిస్ కాలేదు. భర్త రాజ్ కుంద్రా ఆరోగ్యంగా ఉండాలని కర్వా చౌత్ వ్రతాన్ని నిష్టగా అమలు చేశారు. ఉదయం నుంచి పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా పూజలు చేశారు. రాత్రి వేళ భర్తను చంద్రుడితో కలిపి జల్లెడ జాలీలో చూశారు. అనంతరం భర్త కాలికి నమస్కరించారు. రాజ్ కుంద్రా స్వీట్ తినిపించడంతో ఉపవాస దీక్షను విరమించుకున్నారు.

కేన్సర్ బారిన పడి చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతురాలైన నటి సోనాలీ బింద్రే కూడా కర్వా చౌత్ పండుగను చేసుకున్నారు. భర్త గోల్డి భెల్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు నిర్వహించారు. ఉదయాన్నే స్నానం చేసి సంప్రదాయ దుస్తువులు ధరించారు. కుటుంబసభ్యులతో కలిసి కర్వా చౌత్ పండుగను జరుపుకున్నారు. రాత్రి వేళల్లో జల్లెడ జాలీలో చంద్రుడిలో భర్త ముఖాన్ని చూసి ఉపవాస దీక్షను విరమించుకున్నారు.

విదేశీ గాయకుడు నిక్ జోనస్ ను పెళ్లాడిన ప్రియాంక చోప్రా కూడా కర్వా చౌత్ పండుగను జరుపుకున్నారు. లాస్ ఏంజిల్స్ లో కర్వా చౌత్ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలకు క్యాప్షన్ ‘లవ్ యూ నిక్’ అని పెట్టారు. వీరితో పాటు కొత్త దంపతులు సైతం ఈ పండుగను నిర్వహించుకున్నారు. కాజల్ అగర్వాల్-గౌతమ్, రానా-మిహికా కూడా సంప్రదాయాన్ని పాటించారు. సంప్రదాయ దుస్తువులు ధరించి తమ భర్తలతో దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు.

 

View this post on Instagram

 

Happy Karwa Chauth to everyone celebrating.❤️ I love you @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

 

View this post on Instagram

 

Happy Karwa Chauth to those celebrating ❤️ I have always found rituals and traditions like these to be very comforting. In my sphere of things, they are in many ways a bridge between the old and the new ways of thinking and living. Rather than be averse and antipathetic, I have always looked at how to evolve and adapt for a more harmonious way of life. Every year, I celebrate Karwa Chauth with my family and friends. This ritual brings a new colour to my relationships, especially with my mother-in-law. It’s become a tradition to celebrate it together and I actually look forward to the day and what it entails, especially when we all come together. For me, it’s about this sisterhood we have created, being grateful for the beautiful bond my husband and I share and of course the opportunity to be pampered throughout the day. Do what makes you happy!

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

Read more RELATED
Recommended to you

Latest news