అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఆశ పడుతున్న బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్.!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 1 సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో మన అందరికి తెలుసు. ఈ సినిమా ఇద్దరూ పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళి పోయారు. అల్లు అర్జున్ స్టయిల్ ఆఫ్ యాక్షన్ కు దేశం మొత్తం పిధా అయ్యింది. ఇప్పుడు అందరూ రెండొ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ద డబ్బింగ్ సినిమాలకు కు కూడా అక్కడ విపరీతంగా ఆదరణ పొందాయి. తన ప్లాప్ సినిమాలు కూడా అక్కడ మిలియన్స్ లో వ్యూస్ సాధిస్తోంది.

ప్రస్తుతం డిసెంబర్ 8న ‘పుష్ప ది రైజ్’ రష్యాలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. విడుదలకి ఇంకో వారం మాత్రమే సమయం ఉండడంతో ‘పుష్ప ది రైజ్’ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ రష్యా చేరుకున్నారు. అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక అండ్ టీంకి ఘన స్వాగతం పలికారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులతో పాటు.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా బన్ని సినిమాతో సినిమా చేయడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

రీసెంట్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఉంది అంటూ… తన మనసులో ఉన్న కోరికను పంచుకున్నాడు.ఇక బన్నీతో కలిసి సినిమా చేయడం తనకు చాలా ఇష్టం అన్నారు . అలాగే ఆయన డాన్స్ ను నేను చాలా లైక్ చేస్తాను అన్నారు బాలీవుడ్ స్టార్ దర్శకుడు రోహిత్ శెట్టి.బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు తెరకెక్కించిన రోహిత్ శెట్టి.. ప్రస్తుతము ఆయన  దర్శకత్వం లో వస్తున్న  సర్కస్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఆ సందర్బంగానే  ఆయన మాట్లాడుతూ ఈ కోరిక గురించి చెప్పారు.