రెచ్చగొడుతున్న బాబు..కొత్త కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా?

చంద్రబాబు జిల్లాల టూర్లకు జనం నుంచి మంచి స్పందన వస్తుంది. ఆయన రోడ్ షోలకు ప్రజలు భారీగానే వస్తున్నారు. ఈ మధ్య కర్నూలులో కావచ్చు..తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు. బాబు రోడ్ షోలకు విపరీతమైన స్పందన వస్తుంది. ఏదైనా సర్కిల్‌లో సభ పెడితే..ఆ సర్కిల్ మొత్తం జానా సందోహంతో నిండిపోతుంది. సరే వారంతా టీడీపీ శ్రేణులే అనుకోవడానికి లేదు. పార్టీ శ్రేణులని తరలించినా ఆ రేంజ్‌లో ఉండరు. జనం కూడా బాబు సభలకు వస్తున్నారు. టూర్ ఆలస్యంగా నడిచిన నిలబడుతున్నారు.

ఇక జనాలని చూసిన ఊపులో బాబు అదిరిపోయే స్పీచ్‌లు ఇస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఎటు చూసుకున్న జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిందని, ఇంకా తానే రాష్ట్రాన్ని గాడిలో పెడతానని అంటున్నారు. అలాగే తనకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని, కానీ మీకు అండగా ఉండటం కోసమే వచ్చానని చెబుతున్నారు. ఇక జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, పన్నుల భారం, అక్రమాలపై ధ్వజమెత్తుతున్నారు.

సరే ఇదంతా బాగానే ఉంది గాని..ప్రతి అంశాన్ని చెబుతూనే..ఎన్ని జరిగినా మీరు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు..ఎదురు తిరుగులేరు..వైసీపీ వాళ్ళు, పోలీసులు ఏం చేస్తారనే భయపడుతున్నారని ప్రజలని..బాబు రెచ్చగొడుతున్నారు. తాజాగా నిడదవోలులో జరిగిన సభలో ఓ రైతు..గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు, ధాన్యం డబ్బులు టైమ్‌కు పడటం లేదని వివరించారు.

అంతే బాబు..ఆ రైతుపై విరుచుకుపడ్డారు. “ధాన్యం కొనపోతే మీరు ఏం చేయాలి..తిరగబడాలి. అలా కాకుండా మీరు ఇంట్లో పడుకుంటే.. నేను ధాన్యం కల్లాలు చుట్టూ తిరగాలా? అని ఫైర్ అయ్యారు. మీరు ఎదురుతిరిగి జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, తాను అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. అంటే ఏం చేసిన ప్రజలు..జగన్ ప్రభుత్వంపై తిరగబడాలని రెచ్చగొడుతున్నారు. మరి ఇదేమన్న బాబు కొత్త స్ట్రాటజీ అయి ఉంటుంది. అలా రెచ్చగొడితే..ఇంకా ప్రజలు జగన్ ప్రభుత్వంపై కోపం పెంచుకుని, ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేయరని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.