బోనాలు స్పెషల్.. దుమ్ములేపుతున్న మంగ్లీ పాట. 

-

తెలంగాణ పండగల మీద పాటలు పాడి పేరు తెచ్చుకున్న మంగ్లీ(mangli), ప్రస్తుతం బోనాల మీద పాట పాడింది. ప్రతీ ఏడాది పండగల మీద పాడే పాటల్లో కొత్తదనం ఉండేలా చూసుకునే మంగ్లీ, ఈసారి సరికొత్త పాటతో ముందుకు వచ్చింది. ఆషాడ మాసం ఆదివారం నాడు హైదారాబాద్ లో తొలి బోనం గోల్కోండ కోటలో ఎత్తిన వేళ, తన పాటను యూట్యూబ్ లో విడుదల చేసింది. చెట్టుకింద కూసున్నవమ్మా సుట్టం లెక్క ఓ మైసమ్మా అంటూ సాగిన ఈ పాటకి యూట్యూబ్ లో వ్యూస్ విపరీతంగా వస్తున్నాయి.

మంగ్లీ mangli
మంగ్లీ mangli

కల్లు పోస్తిమే మైసమా, కోడ్ని కోస్తిమే మైసమ్మా, బోనం ఎత్తితిమే మైసమ్మా, బొమ్మలెక్క నువ్వు కూసున్నావేంది మైసమ్మా, వచ్చిన మందంతా వండుకుని తిని, తిండి తీర్థం తాగి తిరిగెళ్ళి పోతుంటే మందలియ్యవేందే మైసమ్మా అంటూ దేవతను నిలదీస్తున్నట్టుగా పాట సాగింది. ఢీ పండు అందించిన స్టెప్పులతో పాటంతా పండగలా కనిపించింది. దర్శకుడు దాము రెడ్డి చాలా చక్కగా తెరకెక్కించారు.

పాటలో సాహిత్యం సరిగ్గా కుదిరించి. ఎన్నిసార్లు బోనాలు ఎత్తినా, కొబ్బరి కాయలు కొట్టినా, ఎన్ని చేసినా మమ్మల్ని పట్టించుకోవా? అన్నట్టు ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కుదిరింది. సాహిత్యం రామస్వామి అందించగా, సినీ పాటల కాసర్ల శ్యామ్ సహాయం చేసారు. ఇంకా పాటలో టిక్ టాక్ ఫేమ్ చార్లెస్ చిచ్చా, ఢీ పండు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంగ్లీ గొంతుతో పాటకి సరికొత్త ఊపు రావడంతో ఒక్కరోజునే 1మిలియన్ వ్యూస్ దక్కించుకుని ట్రెండింగ్ లో 1వ స్థానంలో ఉంది. మరి ఇంతమంచి పాటని ఇప్పుడే వినేయండి.

Read more RELATED
Recommended to you

Latest news