టిడిపి పార్టీ నాయకులు బోండా ఉమ మరియు బుద్ధ వెంకన్న లు వైయస్ జగన్ నే ఫాలో అవుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా మాచర్లలో బోండా ఉమా మరియు బుద్ధ వెంకన్న కారుపై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఆ దాడి విషయంలో ఇటీవల డీజీపీ కార్యాలయంలో ఇద్దరు నేతలు ఫిర్యాదు చేశారు. తమపై దాడులకు పాల్పడింది వైసిపి పార్టీకి చెందిన నాయకులు అని ఫిర్యాదులో కొంతమంది పేర్లు ఇచ్చారు. దీంతో వీర ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం గుంటూరు రేంజ్ పోలీస్ అధికారులు ఇద్దరి నాయకులను కూడా హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఇప్పుడు తాము విచారణకు హాజరయ్యేది లేదంటూ ఎదురు తిరగటం ఇప్పుడు సంచలనం సృష్టించింది. గుంటూరు పోలీసులపై తమకు నమ్మకం లేదు కాబట్టి వారు జరిపిన విచారణకు మేము హాజరయ్యే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు.
అయితే ఆరోజు ఘటన జరిగిన సందర్భంలో గుంటూరు పోలీసులే తమని కాపాడారని చెప్పిన ఇద్దరు నేతలు ఇప్పుడు పోలీసులపై నమ్మకం లేదు అనటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదే టైమ్ లో ఇప్పుడు సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ హైకోర్టులో కేసు వేయటం చూస్తే…గతంలో వైయస్ వివేకానంద రెడ్డి విషయంలో జగన్ అనుసరించిన విధానాన్ని వీళ్ళు అనుసరిస్తున్నట్లు అర్థమవుతుంది.