దేశంలో ఏదో ఒక చోట కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. పరిస్తితి ఇక్కడ కూడా తీవ్రతరం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం ఈ వైరస్ కు మెడిసిన్ లేకపోవడం ఒకటి అయితే, ఇది అత్యంత సులువుగా ఒకరి నుండి వందల మందికి సులభంగా వ్యాపించడం ముఖ్య కారణం. దీని నివారణ కు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అని అటు ప్రభుత్వాలు ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను కోరుతున్నాయి.
తమ వంతు కర్తవ్యం గా సినీ హీరోలు కూడా కరోనా వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సామాన్య ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఎటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల కరోనా ను దరి చేరకుండా చేయవచ్చు అనే దానిని ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి చాలా వివరంగా ప్రజలకు ఈ వీడియో ద్వారా తెలిపారు.
ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయింది. అయితే ఇదే బాటలో మరో టాలీవుడ్ హీరో ముందుకు వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విషయం పై స్పందిస్తూ కరోనా వైరస్ నేపథ్యంలో అందరు సామాజికంగా దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రజలందరు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మసులుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తి గత శుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి ని అరికట్టవచ్చని మహేష్ బాబు ప్రజలకు తన వంతు సందేశాన్ని ఇచ్చారు.