సీఎం కేసీఆర్ ను మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని.. పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ప్రకటించారు.
అయితే దీనిపై మునుగోడు టికెట్ ఆశించిన బురా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. మునుగోడు అభివృద్ధి కోసం ప్రభాకర్ ను గెలిపించాలని కోరుతున్నానని చెప్పారు. టికెట్ ఆశించడం తప్పు కాదని.. నా అవసరం జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుంధని కేసీఆర్ అన్నారని వెల్లడించారు. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తానని ప్రకటించారు బూర నర్సయ్య గౌడ్.