ఓమిక్రాన్ ఎఫెక్ట్: ఇండియాలో బూస్టర్ డోస్ కు అనుమతి…

-

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భయాలు ప్రపంచ దేశాల్లో నెలకొన్నాయి. ప్రజల ఇమ్యూనిటీ పెరగడానకి బూస్టర్ డోసులు వేయాలంటూ ప్రతిపాదనుల వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో బూస్టర్ డోసులకు అనుమతి లభించింది. బూస్టర్ డోసుగా వినియోగించుకునేందుకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు DCGI అనుమతి ఇచ్చింది. దేశంలో బూస్టర డోసులగా అనుమతి పొందిన తొలి టీకాగా కోవిషీల్డ్ నిలువనుంది. కోవిషీల్డ్ ప్రజల్లో రోగనిరోధక శక్తి పెంచుతుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం అభిప్రాయపడింది. దీని వల్ల కరోనా తీవ్ర లక్షణాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తెలిపింది. దేశంలో బూస్టర్ డోసులు వేసేందుకు అవసరమైన వ్యాక్సిన్లు ఉన్నాయని సీరం తెలిపింది.

కోవిషీల్డ్

ఓమిక్రాన్ తీవ్రత పెరిగిన తర్వాత బూస్టర్ డోసులకు ప్రాధాన్యత ఏర్పడింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు కూడా బూస్టర్ డోస్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. మిగతా రాష్ట్రాల నుంచి కూడా ప్రతిపాదనుల వస్తున్నాయి. మరోవైపు కోవాగ్జిన్ కూడా బూస్టర్ డోసుల అనుమతి కోసం ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో కోవాగ్జిన్ కూడా బూస్టర్ డోస్ అనుమతి వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news