తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నాడుకట్టుపట్టి వద్ద బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్‌ను సజీవంగా వెలికి తీయాలన్న ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు బారిబావిలో పడిన సుజీత కథ విషాదాంతంతో ముగిసింది. 80 గంటల పాటు చేసిన రెస్క్యూ ఆపరేషన్ ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. బాలుడిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. లోపలి నుంచి దుర్వాసన వస్తుండడంతో సుజిత్ చనిపోయాడని నిర్ధారించి సహాయక చర్యలు నిలిపివేశారు. అతడి మృతదేహాన్నీ క్రేన్ ద్వారా బయటకు తీశారు.
ప్రస్తుతం ఆ చిన్నారి బాడీ డీకంపోజింగ్ స్టేజీలో ఉంది… చిన్నారి మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. కొడుకు కచ్చితంగా ప్రాణాలతో తిరిగివస్తాడాని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు అతడు ఇక ప్రాణాలతో లేడు అని తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు. సుజీత్ క్షేమంగా బయటకు రావాలని ప్రధాని మోడీ, రజినీకాంత్, దేశంమంతా కోరుకున్నారు.. కానీ ఇప్పడు సుజీత్ లేడు అన్న వార్త అందరిని కలిచివేసింది.