‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ ర‌ద్దు చేయాలంటూ పిర్యాదు..

-

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు`. తాజాగా దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అయితే మొదట్లో ఈ సినిమాను అందరూ తేలికగా తీసుకున్నారు కానీ.. ఈ సినిమా ట్రైలర్ వివాదాస్పదంగా ఉండడంతో జనాల దృష్టి దీనిపై పడింది. అయితే రాంగోపాల్‌ వర్మ నిర్మిస్తున్న ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్‌ రద్దు చేయాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు పలువురు నాయకులతో కలిసి వచ్చి సోమవారం నగరంలోని టూటౌన్‌ పోలీసులకు రాంగోపాల్‌ వర్మపై ఫిర్యాదు చేశారు. కులాల మధ్య రామ్ గోపాల్ వర్మ గొడవలు సృష్టిస్తున్నారని, సినిమా టైటిల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ప్రేక్షకులకు వినోదం కల్పించాల్సిపోయి ఇలాంటి టైటిల్స్‌తో రాజకీయంగా కులాల మధ్య మనస్పర్థలు, గొడవలు సృష్టించే యత్నం చేయడం దారుణమన్నారు. ఈ క్ర‌మంలోనే తక్షణమే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు టైటిల్‌ రద్దు చేయాలని, అవసరమైతే టైటిల్‌ను నిషేధించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news