అసలు బోస్టన్ ని ఎవడు అడిగాడు .. ఎందుకు చెప్తోంది ఇదంతా ?

-

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ జన కఠినంగా అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. లాక్ డౌన్ నిర్ణయంతో దేశంలో సామాన్య ప్రజలు మరియు కూలీలు అదేవిధంగా దిగువ మధ్యతరగతి పేద వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో అన్ని రంగాలు స్తంభించి పోవడంతో ఉపాధి లేక, కుటుంబాలను పోషించటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి దారుణమైన మందులేని వైరస్ ని ఎదుర్కోవాలంటే నివారణ ఒక్కటే మార్గం అని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.The Ultimate Guide to Acing the BCG Recruitment Process | TapChief ...దీంతో ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత దశలవారీగా లాక్ డౌన్ ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి టైములో కరోనా వైరస్ లాక్ డౌన్ ఈ విషయంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో హైలెట్ వార్తగా నిలిచింది. ఆ నివేదికలో ఏముందంటే ఇండియాలో లాక్ డౌన్ జూన్ నెలాఖరు వరకు ఉంటుందని తమ నివేదికలో పేర్కొనడం జరిగింది.

 

కేవలం ఒక వారం రోజులు ప్రజలను బయటకు వదిలి వెంటనే పెద్ద కారణం చూపించి కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్  నీ పొడిగిస్తారు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు మాత్రమే లాక్ డౌన్ ఉంటుందని స్పష్టం చేస్తూ ఉంటే అసలు బోస్టన్ ని ఎవడు అడిగాడు .. ఎందుకు చెప్తోంది ఇదంతా ? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news