2012 నవంబరు 2..ఆ..రోజు తెలుగుదేశం దిగ్గజ నేత ఎర్రన్న రోడ్డు ప్రమాదంలో మరణించారు. మర్నాడు ఎర్రన్న అంత్యక్రియలు అంటే ..2012, నవంబర్ 3.ఆ..రోజు ఉమ్మడి రాష్ట్రం అంతా శోక సంద్రంలో ఉంది. ఆ రోజు బొత్స ఇంట పెళ్లివేడుక. ఆయన కూతురు పెళ్లి వేడుక.
ఆయన మాత్రం వేడుకలను రద్దు చేసుకోలేదు. విజయనగరంలో అంగరంగ వైభవంగా జరిపించారు. ఆ రోజు ఇక్కడ ఎర్రన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన నేతలంతా.. బొత్స ఇంటికి వెళ్లి పెళ్లి భోజనం చేసి వెళ్లారు.
అంటే ఆ..రోజు ఎర్రన్న ఇంట విషాదాన్ని అస్సలు బొత్స పట్టించుకోలేదు అన్నది ఓ వాస్తవం. తరువాత దశలో ఎర్రన్న కుమారుడు రామూకు బాహాటం గానే బొత్స మద్దతు ఇచ్చారు.
వైసీపీ అధిష్టానం ఎదుటే ఈ సారి కూడా (2019ఎన్నికల సందర్భంలో) రామూనే గెలుస్తాడు అక్కడ వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీను (ప్రస్తుతం అత్యంత వివాదాస్పద ఎమ్మెల్సీ,ఈయన కూడా అధికారులను నోటికివచ్చిన విధంగా తిడుతుంటారు. ఇటీవలే మాజీ మంత్రి అయ్యన్నను ఉద్దేశించి ఆయనొక నపుంసకుడు అని అన్నారు..ఆ వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి)
కాలం ఎంత గొప్పది. .ఆ రోజు బొత్స తన కుమార్తె వివాహ వేడుకల సందర్భంగా విజయనగరంలో చాలా రహదారులు మూయించేశారు. బారికేడ్లు కట్టించి మరీ!ఆపేశారు. పెళ్లికి వచ్చే అతిథులకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండాఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ..రోజు ఆర్టీసీ ప్రయాణికులు నానా తిప్పలు పడ్డారు. ముఖ్యమమయిన దారులన్నీ బొత్స మూయించివేయడంతో బస్సులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాల్సి వచ్చింది.కానీ ఇప్పుడు తన కుమారుడు సందీప్ వేడుకలను హైద్రాబాద్ హైటెక్స్‌లో చేశారు. జగన్ వెళ్లారు. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలకూ చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు వెళ్లారు.కొత్త దంపతులను ఆశీర్వదించి వచ్చారు.
కాలం ఎంత గొప్పది ఆ రోజు వైఎస్సార్ హయాంలో చక్రం తిప్పిన బొత్స ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఓ సందర్భంలో జగన్ ని ఉద్దేశించి పీసీసీ చీఫ్ హోదాలో ఆనాడు అనరాని మాటలు అన్నా కూడా జగన్ భరించి నవ్వి వదిలేశారు. వైసీపీ హయాంలో మంత్రి అయ్యాక కూడా పెద్దిరెడ్డి, సాయి రెడ్డిని కూడా ఆయన టార్గెట్ చేశారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన లక్ష్మీ నృసింహం పదోన్నతిపై సెక్రటేరియట్ లో ఉన్నతాధికారిగా ఉన్నారు. ఆయన్ను ఉద్దేశించి కూడా చాలా మాటలు అన్నారు. కా నీ అవన్నీ నెగ్గుకురాలేదు. ఇవాళ బొత్స మాట క్యాబినెట్ లో చెల్లుబాటు కావడం లేదు. ఆయన మాట వినిపించుకునే స్థితిలో ఏపీ సీఎంఓ లేదు గాక లేదు. అందుకే ఆయన తెలంగాణలో వ్యాపారాలు, ఆస్తులు పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. అందుకే నిన్నటి వేళ తెలంగాణ కాంగ్రెస్ తో సహా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అక్కడికి హాజరై షో చేశారు. బాగుంది కదా! రాజకీయం.. ఇది రా రాజకీయం అంటే.. సెబ్బాస్ జగన్..
-మన లోకం ప్రత్యేకం
– రత్నకిశోర్ శంభుమహంతి