దోపిడీ దారులకు మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుందని భయం పట్టుకుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు వస్తే ఏం చేస్తాడు?? ప్రజలు తనకు ఐదేళ్ళు అవకాశం ఇస్తే రాష్ట్రానికి ఏం చేశాడు అని ఆయన ప్రశ్నించారు. జగనే రాష్ట్రానికి రక్ష అని, రెండు లక్షల కోట్లను డీబీటీ రూపంలో ఇచ్చిన ప్రభుత్వం ఇది అని ఆయన అన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరగటం వల్లనే రాష్ట్రం జీఎస్‌డీపీ పెరిగిందని, మా ప్రాధాన్యత విద్యా, వైద్యం, వ్యవసాయం, సంక్షేమమన్నారు.
అంతేకాకుండా.. ‘నమ్మకానికి పేటెంట్ జగన్ దే.. మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు టచ్ లో ఉన్నారో పేర్లు చెప్పమనండి.. అనవసరపు మాటలు ఎందుకు?? ఇలాంటి రాజకీయాలు చూస్తూనే ఉన్నాం. గతంలో విద్యా అనగానే కేరళ గురించి మాట్లాడే వాళ్ళు. తర్వాత ఢిల్లీ గురించి చర్చించుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు. ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించటం ఎక్కడైనా జరిగిందా??. ఇంతకు ముందు ఒకటి రెండు పంటలకే మద్దతు ధర ఉండేది. జనసేన రాజకీయ పార్టీ అని నేను అనుకోవడం లేదు. జనసేన సెలబ్రిటీ పార్టీ’ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.