ఈ మధ్య వయో బేధం లేకుండా కామపిశాచులు పేట్రేగిపోతున్నారు. రోజులో ఎన్నో అలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనల వలన కొన్ని సార్లు మహిళలు ప్రాణాలను సైతం బలవంతంగా తీసుకుంటున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన కొందరిని అయినా మారుస్తుందని ఆశిద్దాం. టీం ఇండియా మహిళా క్రికెటర్ స్నేహ రాణా కోచ్ నరేంద్ర షా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయినట్లు సమాచారం. తెలుస్తున్న వివరాల ప్రకారం ఈయన ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితో ఫోన్ లో అసభ్యంగా మెసేజ్ లు పంపాడట.
ఈ విషయాన్ని సదరు మహిళ కంప్లైంట్ చేయడంతో ఇతనిని అరెస్ట్ చేయగా… అంతలోనే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పోలీసులు ఆయనను ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. డిశ్చార్జ్ అనంతరం మళ్ళీ ఈయనను పోలీసులు అరెస్ట్ చేశారు.