కేఎల్ రాహుల్ పై బీర్ బాటిల్ మూతలు విసిరిన ఇంగ్లాండ్ ఫ్యాన్స్.. కోహ్లీ సీరియస్

ఇంగ్లాండ్ మరియు ఇండియా మధ్య… రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండో టెస్ట్ మ్యాచ్… లార్డ్స్ స్టేడియం లో జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా ఓపెనర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ చేస్తుండగా… ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్… అతనిపై బీర్ బాటిల్ మూతలతో  దాడి చేశారు.

ఫీల్డింగ్ చేస్తున్న కె.ఎల్.రాహుల్ ను ఇబ్బంది పెడుతూ… నోటికొచ్చినట్లు తిట్టారు. అక్కడితో ఆగకుండా కేఎల్ రాహుల్ పై బీర్ బాటిల్ మూతలను  విసిరారు. ఈ ఘటన మూడవరోజు 69 వ ఓవర్ జరుగుతుండగా చోటు చేసుకుంది. ఆ సమయంలో కెప్టెన్ రూట్ మరియు బేర్ స్టో బ్యాటింగ్  చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కేఎల్ రాహుల్ పై బాటిళ్లను విసిరారు ఇంగ్లాండ్ ఫ్యాన్స్. అయితే ఈ ఘటన చూసిన విరాట్ కోహ్లీ… ఇంగ్లాండ్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ  బీర్ బాటిల్ మూతలను వారిపైనే విసిరేయమని రాహుల్ కు సలహా ఇచ్చారు కోహ్లీ. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.