మెగాస్టార్ చిరంజీవికి సీఎం జగన్ ఆహ్వానం

-

క‌రోనా వేవ్ తగ్గుముఖం ప‌ట్ట‌డంతో థియేట‌ర్లు తెరిచేందుకు ఎగ్జిబిట‌ర్లు సిద్ధ‌మైనా ఏపీలో టిక్కెట్టు ధ‌ర స‌మ‌స్యాత్మ‌కం అయిన సంగ‌తి తెలిసిందే. స‌వ‌రించిన ధ‌ర‌ల‌తో ఎగ్జిబిష‌న్, పంపిణీ రంగాలు చిక్కుల్లో ప‌డ్డాయి. థియేట‌ర్ల స‌మ‌స్య చాలాకాలంగా ఓ కొలిక్కి రాలేదు. సీఎం జ‌గ‌న్ తో భేటీ కోసం సినీపెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఏపీ మంత్రి పేర్ని నాని నేరుగా మెగాస్టార్ చిరంజీవికి శనివారం రోజు ఫోన్ చేసి , సినీపెద్ద‌ల‌తో క‌లిసి వ‌చ్చి ప్రస్తుత స‌మ‌స్య వివరిచ్చాల్సిదిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ కీల‌క భేటీలో ప్ర‌స్తుతం ఉన్న థియేట‌ర్ల స‌మ‌స్య గురించి .. ఈ రంగంపై ఆధార‌ప‌డి జీవిస్తున్న కార్మికుల బ‌తుకు తెరువు స‌హా.. పంపిణీ వ‌ర్గాల వేతనాల గురించి మాట్లాడే అవ‌కాశం ఉంది. చిరంజీవితో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొంద‌రు హాజరు కానున్నారు.

ఇంత‌కుముందు సీఎంతో భేటీ లో చిరంజీవి- నాగార్జున – రాజ‌మౌళి- సురేష్ బాబు బృందం స‌మ‌స్య‌లు విన్న‌వించగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే , అలాగే గతంలో పరిశ్రమ కు అనుకూలంగా సియం జగన్ ఎప్పుడు వరాలు ఇచ్చినా , చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన సందర్భాలున్నాయి .. ఇప్పుడు ఈ భేటీ ఈ నెల చివరి వారంలో జరగనుంది , ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈసారి స‌మ‌స్య‌కు త‌క్ష‌ణ పరిష్కారం చూపిస్తార‌నే అంతా ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news